ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వదలడం లేదు.ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, డిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్ కు లిక్కర్ స్కాంలో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొన్నారు. కేజీవాలకు ఈడీ నోటీసులు పంపడం ఇది ఐదోసారి. కానీ ఇప్పటివరకు ఆయన ఈడీ విచారణకు హాజరుకాలేదు.ఈడీ నోటీసులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. మరి ఈసారి అయినా సీఎం కేజ్రీవాల్ హాజరవుతారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి జనవరి 18న విచారణకు హాజరు కావాలని ఈడి నాలుగోసారి కేజ్రీవాల్ కి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు నవంబర్ 2న, డిసెంబర్ 22న, జనవరి 3న ,జనవరి 13వ తేదీన నోటీసులు ఇచ్చింది.