కర్ణాటక రాష్ట్రంలో బంద్ మొదలైంది. కావేరి జలాల కోసం కన్నడ సంఘాలు బంద్ కు పిలుపునివ్వడంతో ఇవాళ ఉదయం నుంచి రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. బెంగళూరులో బిఎంటీ బస్సులు యధావిధిగా రోడ్లపైకి వచ్చిన జనం లేక మెజెస్టిక్ బస్టాండ్ వెలవెలబోయింది. బంద్ కారణంగా బెంగళూరులోని స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలుచేస్తున్నారు.
ఇక ఈ బంద్ కు ఆటో రిక్షాలు, ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ మరియు హోటల్స్ సపోర్ట్ ఇవ్వగా… BMTC మాత్రం ఇవాళ సర్వీస్ నడుపుతారని సమాచారం. మరి ఈ కావేరి జలాల కోసం రెండు రాష్ట్రాల మధ్యన వివాదం ఎప్పుడు తీరుస్తుందో చూడాలి. కాగా, గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు.