రైతులను నిరుత్సాహ పరిచేలా వార్తలు రాయొద్దు: డీఎస్‌ చౌహాన్‌

-

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్ చౌహాన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం తీసుకువస్తున్న రైతులతో తాను నేరుగా మాట్లాడానని.. ధాన్యం అమ్మిన 3 రోజుల్లోనే డబ్బులు పడ్డాయని రైతులు చెబుతున్నారని తెలిపారు. రైతులకు ఫోన్‌ చేసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగానని.. అంతా బాగానే ఉందని చాలా మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రైతులను నిరుత్సాహ పరిచేలా వార్తలు రాయొద్దని మీడియా సంస్థలకు సూచించారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకున్నామని డీఎస్ చౌహాన్ తెలిపారు. గతంలో ఏప్రిల్‌ తొలి వారం తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారని.. ఈ ఏడాది మార్చి 25వ తేదీలోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని వెల్లడించారు. దాదాపు 80 కొనుగోలు కేంద్రాలను నేను పరిశీలించానన్న.. డీఎస్ చౌహాన్ రాష్ట్రంలో 7,241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ బియ్యానికి ఒక బ్రాండ్‌ ఉందని, దాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 83 శాతం ధాన్యానికి చెల్లింపులు జరిగాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news