కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రీ బస్సు సంచలన నిర్ణయం తీసుకోనుందట కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక దీనిపై తాజగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాక్యలు చేశారు. కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.
టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. సోషల్ మీడియా ద్వారా, ఈ-మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారన్నారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. దీనిపై రవాణా మంత్రి రామలింగా రెడ్డితో చర్చిస్తాను అని వివరించారట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఇక డీకే శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఫ్రీ బస్సును తొలగిస్తారని అంటున్నారు.