విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌బీఐ, ఇంటర్ పోల్ సాయం కోరినట్లు తెలుస్తోంది. ఖలీస్థానీలకు వీటితో సంబంధం ఉందేమో అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని ఎఫ్‌బీఐని అభ్యర్థించింది. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 410కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఆ జాబితాలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నయ్, హైదరాబాద్, బెంగళూరు తదితర ఎయిర్ పోర్టులకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. నేటికీ విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజులో కనీసం 10కి పైగా బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం సీరియస్‌గా ఉన్నది. ఇటువంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.