లాక్‌డౌన్‌ మరో 2 వారాలు పొడగింపు

-

కొవిడ్‌ కేసులు కర్ణాటక మొత్తం 32218 కేసులు నమోదయ్యాయి. కేవలం బెంగళూరులోనే 9591 కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప కేబినెట్‌ సమావేశం శుక్రవారం నిర్వహించారు. కరోనా కేసుల తగ్గించే దిశగా అధికారులు తదుపరి చర్యల దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మరణాలు తగ్గించేందుకే మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ నియమాలలో ఏమాత్రం మార్పు ఉండదని, కర్ఫ్యూ అమలులో ఉన్నా, రాత్రి 10 గంటకు కూడా జనాలు తిరుగుతున్నారని పోలీసులు సీఎం కు తెలిపారు. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసుల పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలు దీని చికిత్స ఖర్చు భరించలేరని అందుకే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్సను అందించనున్నామని యడ్యూరప్ప ప్రకటించారు. దీనికి సంబంధించిన తదుపరి చర్యలను త్వరలో ప్రకటిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు.

కర్ణాటకలో లాక్‌డౌన్‌ మరో రెండు వారాలపాటు పొడగిస్తిన్నట్లు సోషల్‌ మీడియా ట్వీట్టర్‌లో వైరల్‌ అవుతోంది. జూన్‌ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నట్లు ట్విట్టర్‌లో ఉంది. దీన్ని ప్రముఖ జర్నలిస్ట్‌ శివ్‌ అరూర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

బ్లాక్‌ ఫంగస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం కూడా అందించనున్నట్లు ఓ ట్విట్టర్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. కానీ, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే సోషల్‌ మీడియాలో దీనిపై విభిన్న స్పందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news