ఈటల రాజేందర్ బీసీ నేత. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కాలం నుంచి అనేక ఉద్యమ, ఉద్యోగ, కుల సంఘాలతో సంబంధాలు ఉన్న నేత. రాష్ట్రంలోనే బలమైన బీసీ నేతగా పేరుగాంచిన సమర్థుడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ఎవరూ మద్దతు తెలపట్లేదు. కనీసం కలిసి కూడా మాట్లాడట్లేదు. దీని వెనక ఆంత్యర్యం ఏంటి.
బీసీ నేతలుగా ఉన్న ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, ఇతర బీసీ సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే బీసీ సంఘాలు మీటింగులు పెట్టి మరీ భగత్‌కుమార్‌కు సపోర్టు చేశాయి.
మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన బీసీ నేతకు అన్యాయం జరిగితే ఎందుకు వారు మద్దతు తెలపట్లేదు. అంటే పలువురు బీసీ మంత్రులు వారిని కంట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈటలకు వారు మద్దతు తెలిపితే తాము బీసీల్లో తక్కువవుతామని అందుకే మౌనంగా ఉండాలని, ఈటల తప్పు చేసినందుకు బర్తరఫ్ అయ్యారంటూ నచ్చజెపుతున్నారని తెలుస్తోంది. మరి బీసీ సంఘాల నేతలు చివరి దాకా టీఆర్ ఎస్‌కు సపోర్టు చేస్తారా లేక ఈటలకు జై కొడుతారా చూడాలి.