రూటు మార్చిన మిల్కీబ్యూటీ.. సినిమాల కంటే అవే ఎక్కువ చేస్తున్న త‌మ‌న్నా!

-

త‌మ‌న్నా అంటే అంద‌రికీ ముందుగా ఆమె అంద‌మే గుర్తొస్తుంది. మ‌రి అంత‌గా మిల్కీ బ్యూటీగా బ్రాండ్ సంపాదించుకుంది. చిన్న సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది. అయితే ఈ మ‌ధ్య పెద్ద హీరోల సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గిపోయాయ‌నే చెప్పాలి.

అయినా స‌రే ఎక్క‌డా త‌గ్గ‌కుండా ప్ర‌తి అవ‌కాశాన్ని వినియోగించుకుంటుంది. ఇప్పుడు సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌కు కూడా ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. పెద్ద పెద్ద హీరోలు కూడా వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తున్నారు. ఇప్పుడు త‌మ‌న్నా కూడా వ‌రుస‌గా వెబ్‌సిరీస్‌లు చేస్తోంది.

మొన్న లెవ‌న్త్ అవ‌ర్‌లో న‌టించి మెప్పించింది. ఇప్పుడు న‌వంబ‌ర్ స్టోరీ అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. ఈ నెల 20నుంచి డిసి్న ప్ల‌స్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో త‌మ‌న్నా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సిరీస్‌లో త‌మ‌న్నా అనురాధ అనే హ్యాక‌ర్‌గా న‌టించి మెప్పించింది. దీంతో పాటు అటు నితిన్ అంధాదున్ రీమేక్‌లో కూడా న‌టిస్తోంది. ఇలా రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news