సోషల్‌ మీడియా వాడకంపై వయోపరిమితిని విధించాలి : కేంద్రానికి కర్ణాటక హైకోర్టు సూచన

-

భారత్​లో సోషల్ మీడియా వాడకం చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరూ గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోతుంటారు. అయితే పిల్లల సోషల్ మీడియా వినియోగం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వాడకంపై వయోపరిమితిని విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.

సోషల్ మీడియాను ఉపయోగించడానికి కనీస వయసు 21 ఏళ్లు ఉండేలా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు సూచించింది. నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలనే కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) చేసిన అప్పీల్‌పై న్యాయమూర్తులు జీ నరేందర్, విజయకుమార్ ఏ పాటిల్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం రోజున విచారణ చేపట్టింది. గతంలో కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియా సంస్థ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు.. ఆదేశాలను పాటించనందుకు రూ.50 లక్షల జరిమానా విధించింది.

ఈ విచారణ ముగింపు సందర్భంగా.. సోషల్‌ మీడియాని పూర్తిగా నిషేధించడమే బెస్ట్‌ ఆప్షన్‌ అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాని వల్ల చాలా మేలు జరుగుతుందని .. సామాజిక మాధ్యమాల వల్ల నేడు పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎక్కువగా బానిసలవుతున్నారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news