బల్లులతో ఇబ్బందా..? ఇలా చేసి తరిమేయండి..!

-

ఇంట్లో బల్లులు ఉండటం సర్వసాధారణం. ప్రతి ఒక్కరి ఇళ్లలో బల్లలను మనం చూస్తూనే ఉంటాం. అయితే చాలా మందికి బల్లులంటే భయం ఎక్కువ. వాటిని చూసినా.. అవి మన దగ్గరికి వచ్చినా.. కేకలు వేస్తూ పారిపోతుంటాం. బల్లలు విషపూరితమైనవి. వీటి శరీరంపై ఒక రకమైన యాసిడ్ ఉంటుంది. ఇది మనిషి శరీరంపై పడితే.. ఆ ప్రాంతం మొత్తం కాలిపోతుంది. ఒక వేళ ఇది ఆహారంలో పడితే.. ఆ ఆహారం విషపూరితమవుతుంది. మనుషులు ఈ ఆహారాన్ని తిన్నట్లయితే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. ఇవి రాత్రి వేళల్లో ప్రశాంతంగా నిద్ర కూడా పోనియ్యవు. దీంతో ప్రజలు బల్లులను ఇంట్లో నుంచి బయటకు తరిమేయడానికి ప్రయత్నిస్తుంటారు.

బల్లి
బల్లి

బల్లలను ఇంట్లో నుంచి తరిమేయడానికి ఎంత ప్రయత్నించినా.. అవి మళ్లీ మళ్లీ ఇంట్లోకి చొరబడుతాయి. అయితే ఈ రోజు మీకు బల్లులను ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు కొన్ని చిట్కాలను చెబుతాము. ఇవి మీరు పాటించినట్లయితే.. ఇంకెప్పుడు మీ ఇంట్లో బల్లులు కనిపించవు. మీరు మీ ఇంట్లో ఉంటే సామగ్రితోనే బల్లులను తరిమేయవచ్చు. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా.. ఒక జెగ్ తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో రెండు చెంచాల డెటాల్ లిక్విడ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చెంచా ఉల్లిపాయల రసం తీసుకుని అందులో బాగా కలుపుకోవాలి. మళ్లీ ఇందులో సిట్రిక్ యాసిడ్ లేదా ఒక చెంచా నిమ్మరసం వేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. మీ ఇంట్లో ఎక్కువగా బల్లలు ఎక్కడ ఉంటాయో.. ఆ ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. రోజూలో 3 నుంచి 4 సార్లు ఆయా ప్రదేశాల్లో ఈ రసాయనాన్ని స్ప్రే చేసినట్లయితే బల్లులు పారిపోతాయి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు హాయిగా పడుకోవచ్చు. హ్యాపీగా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news