రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్‌ హత్య కేసు.. ముగ్గురు నిందితుల అరెస్టు

-

రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ  దారుణ హత్య కేసు రాజస్థాన్​లో సంచలనం రేకెత్తిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తాజాగా ఇద్దరు షూటర్లు రోహిత్‌ రాఠోడ్‌, నితిన్‌ ఫౌజీ చంఢీగడ్​లో అరెస్టు చేశారు. నిందితులతో పాటు వారి సహచరుడు మరో వ్యక్తి ఉద్ధమ్‌ సింగ్‌ కూడా అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్‌ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు దిల్లీ పోలీసులతో కలిసి రాజస్థాన్ పోలీసులు సంయుక్త దర్యాప్తు చేశారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..

“సుఖ్‌దేవ్‌ సింగ్​ను గోగామేడీ ఈ నెల 5న రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లోని శ్యామ్‌నగర్‌లో తన నివాసంలో ఉండగా ముగ్గురు వ్యక్తులు సుఖ్‌దేవ్‌ నివాసానికి వెళ్లారు. గోగామేడీతో మాట్లాడాల్సి ఉందని భద్రతా సిబ్బందికి చెప్పారు. భద్రతా సిబ్బంది వారిని లోపలకు తీసుకెళ్లగా.. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలన్నీ ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ముగ్గురు దుండగుల్లో ఒకడైన నవీన్‌ షెకావత్‌ సహచరుల కాల్పుల్లో మరణించాడు. సుఖ్‌దేవ్‌ హత్యకు తమదే బాధ్యత అంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు అనుబంధంగా పనిచేసే రోహిత్‌ గోదారా గ్యాంగ్‌ ప్రకటించుకుంది. ఈ క్రమంలో దిల్లీ పోలీసులతో కలిసి సంయుక్త దర్యాప్తు జరిపి తాజాగా నిందితులను అరెస్టు చేశాం.” అని రాజస్థాన్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news