ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీపై కీలక ప్రకటన వెలువడింది. WCలో గాయపడిన టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కోరుకుంటున్నారని బీసీసీఐ సెక్రటరీ జైశా తెలిపారు. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న టీ20 సిరీస్ కు అతను ఫిట్నెస్ సాధించి జట్టులో చేరతారని స్పష్టం చేశారు.
అలాగే హెడ్ కోచ్ గా ద్రవిడ్ పదవి కాలంపై దక్షిణాఫ్రికా టూర్ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. జనవరి ఏడు వరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్న భారత జట్టు JAN11 నుంచి AFGతో 3T20 లు ఆడనుంది.
అటు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం, కెప్టెన్ రోహిత్ శర్మను వచ్చే టి20 ప్రపంచకప్ లో ఎంపిక చేసే విధానం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు పెసర్ మహమ్మద్ షమీ గాయాల గురించి జైషా మాట్లాడాడు. అయితే టి20 ప్రపంచకప్ వరకు మాత్రమే కాకుండా కోచ్ గా ద్రవిడ్ ను మరికొంతకాలం ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుందని జైషా తెలిపాడు. ప్రస్తుతం ద్రవిడ్ టీమిండియాతో సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నాడు. అది ముగిసిన తర్వాత ద్రవిడ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జైషా వెల్లడించాడు. అయితే పొట్టికప్ లో రోహిత్ స్థానం గురించి గ్యారెంటీ ఇవ్వలేమని జైషా అన్నాడు.