లడఖ్ లో సైన్యం కోసం కేంద్రం కీలక నిర్ణయం…!

భారత సైన్యం శీతాకాలంలో లడఖ్‌ లో గస్తీ కాస్తున్న నేపధ్యంలో వారి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్న నేపధ్యంలో సైన్యానికి ఇబ్బంది లేకుండా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శీతాకాలంలో మోహరించిన దళాల కోసం గానూ ఈ సెక్టార్ లో… భారత సైన్యం నివాస సౌకర్యాల ఏర్పాటును పూర్తి చేసిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

తీవ్రమైన చలి సహా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చల్లటి గాలులు కూడా వీస్తూ ఉంటాయి. దీనితో వీటిని ప్రత్యేకంగా తయారు చేసారు. ఇంటిగ్రేటెడ్ సదుపాయాలతో కూడిన స్మార్ట్ క్యాంప్‌ లతో పాటు, విద్యుత్తు, నీరు, వేడి సౌకర్యాలు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత కోసం సమగ్ర ఏర్పాట్లతో కూడిన అత్యాధునిక నివాస స్థలాలు ఇటీవల దళాలకు వసతి కల్పించడానికి తయారు చేసారు. ఇరువైపులా దాదాపు 50,000 మంది సైనికులను మోహరించడంతో భారతదేశం మరియు చైనా మే మొదటి నుంచి కాస్త వివాదంలో ఉన్నాయి.