సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న పై స్పందించిన కిషాన్ మోర్చా

-

తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ రైతు ఉద్య‌మం లో చనిపోయిన రైతుల విష‌యం లో చేసిన ప్ర‌క‌ట‌న పై కిషాన్ మోర్చా స్పందించింది. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ మ‌ర‌ణించిన‌ రైతుల పై చేసిన ప్ర‌క‌ట‌న ను తాము స్వాగ‌తిస్తున్నామని కిషాన్ మోర్చా ప్ర‌తినిధులు తెలిపారు. మూడు సాగు చ‌ట్టాల ను ర‌ద్దు చేయాల‌ని పోరాటం చేసిన ఉద్యమం లో మ‌ర‌ణించిన రైతులు 700 మంది రైతుల వివ‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి అందిస్తామ‌ని తెలిపారు.

కాగ సాగు చ‌ట్టాల కు వ్య‌తిరేకం గా చేసిన పోరాటం లో చాలా మంది రైతులు చ‌నిపోయారని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. వారి త్యాగ‌లు మ‌న కోస‌మే అని తెలిపారు. వారి కుటుంబాల‌కు రూ. 3 ల‌క్ష‌ల చొప్పున సాయం చేస్తామ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం కూడా మ‌ర‌ణించిన రైత‌లు కు సాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌తి రైతు కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version