5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

-

ఎన్నికల వేళ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారుకు కోల్కతా హైకోర్టు మరో పెద్ద షాక్ ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హయాంలో 2010 సంవత్సరం నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో గత పద్నాలుగేళ్ల వ్యవధిలో జారీ అయిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దయ్యాయి.

ఓబీసీ సర్టిఫికెట్లను వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారంతా ఓబీసీ కోటాలోనే కొనసాగుతరాని తెలిపింది. మరోవైపు బంగాల్ బీసీ కమిషన్ చట్టం – 1993 ప్రకారం ఓబీసీల కొత్త జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్త జాబితాను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలన్న ధర్మాసనం.. 2010కి ముందు బంగాల్ ఓబీసీల జాబితాలో ఉన్న కేటగిరీలలో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news