పిన్నెల్లి దెబ్బ… మాచర్లలో రీ-పోలింగ్ ?

-

మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ తెరపైకి వస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఈవీఎంలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర ఆగ్రహంతో ఈవీఎం సెంటర్లోకి ఎంటర్ అయిన.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… నేలకేసి ఈవీఎంలను బద్దలు కొట్టాడు.

RE POLLING IN MACHARLA

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో వైరల్ కాగానే పారిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం హైదరాబాదులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాక్కున్నారని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి పెట్టి… వెంటనే రీ పోలింగ్కు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇక అటు టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి అలా చేసాడు అంటూ వైసీపీ పార్టీ చెబుతోంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం వెనుక అసలు నిజాలివే అంటూ పేర్కొంది. రెంటచింతల మండలం పాల్వాయిగేటులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లని కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటికి పంపిందట టీడీపీ. వైయస్‌ఆర్‌సీపీ‌కి ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా వారిపై కూడా దాడి చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news