కాళేశ్వరం ప్రాజెక్టు.. ఆ ఇంజినీర్ల టీమ్‌ను మార్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

-

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ముందు నుంచి పని చేస్తున్న  ఇంజినీర్లను మార్చాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చిన అంశం ఇటీవల చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించినట్లు తెలిసింది.

మొదటి నుంచి ఉన్న టీమ్‌ అలాగే కొనసాగుతుంటే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? వారు కీలకమైన అంశాలు వెలుగులోకి రాకుండా చూడటానికే ప్రయత్నిస్తారు తప్ప సమాచారం ఎందుకు ఇస్తారు? అని రేవంత్ రెడ్డి అన్నట్లు సమాచారం. అలాంటి వారందరినీ మార్చి ఉత్సాహంగా పని చేయగలిగిన వారిని, ఎక్కువ సర్వీసు ఉన్నవారిని నియమించడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలకు నీటిపారుదల శాఖ తర్జనభర్జన పడుతోంది. ఎన్డీఎస్‌ఏ, జ్యుడిషియల్‌ కమిషన్‌ నుంచి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవడం మంచిందంటూ ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు ఇంకా శ్రీకారం చుట్టలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news