ఒక్క నిమ్మకాయ రూ.35వేలు.. ఎందుకంత కాస్ట్లీ అంటే?

-

సాధారణంగా ఒక నిమ్మకాయ ధర రెండు నుంచి మూడు రూపాయలు ఉంటుంది. ఇక ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. అది కూడా వేసవి కావడంతో ధర కాస్త పెరిగి ఐదు నుంచి పది రూపాయలు ఉంటుంది. కానీ ఓ చోట ఒక్క నిమ్మకాయ ధర అక్షరాల రూ.35 వేలు పలికింది. ఏంటి ఒక్క నిమ్మకాయకే అంత ధరా అని ఆశ్చర్యపోతున్నారా? ఆ నిమ్మకాయకు ఓ ప్రత్యేకత ఉంది మరి. అదేంటంటే?

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా శివగిరి గ్రామంలోని శివాలయంలో ఈ నెల 8వ తేదీన శివరాత్రి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం నిమ్మ, ఇతర ఫలాలు, సామగ్రిని శివుడికి సమర్పించారు. అనంతరం ఆ సామగ్రిని వేలం వేయగా.. ఇందులో మొత్తం 15 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈరోడ్‌కు చెందిన ఓ భక్తుడు రూ.35 వేలకు నిమ్మకాయను దక్కించుకున్నాడు. వందలాది భక్తుల సమక్షంలో పూజలు నిర్వహించిన అనంతరం అతడికి అందజేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. నిమ్మకాయ దక్కించుకున్నవారికి ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని స్థానికుల విశ్వాసం.

Read more RELATED
Recommended to you

Latest news