కర్ణాటకలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఇంటి ముందు ఆడుకున్న పాపను దాదాపు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. పాప కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు కర్రలతో వచ్చేసరికి బాలికను వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటకలోని మరాజనగర్ జిల్లాలో హనుర్ మండలంలోని కగ్గలి గుండి గ్రామంలో రాము అనే వ్యక్తి.. తన భార్య లలిత, కుమార్తె సుశీల (6)తో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో.. బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన చిరుత బాలికపై దాడి చేసి ఆమెను ఈడ్చుకెళ్లింది. బాలిక కేకలు విని స్థానికులు, కుటుంబ సభ్యులు కర్రలు తీసుకుని పరిగెత్తడంతో చిరుత ఆమెను వదిలేసి పరారైంది. అనంతరం కుటుంబ సభ్యులు బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక అటవీ శాఖ అధికారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు.