జనావాసాల్లోకి చిరుత.. పశువుల పాకలో మూడు పిల్లలకు జన్మ

-

అడవులను నరికివేయడం, కొండలను కూల్చి భవనాలు నిర్మించడం వంటి చర్యలతో క్రూరమృగాలు జనవాసాల్లోకి వస్తున్నాయి. అలా తరచూ జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలపై, పశువులపై దాడి చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే చాలా మంది మరణించారు. ఎన్నో వందల పశువులు మృత్యువాత పడ్డాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి దాడులు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి.

అయితే తాజాగా ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి ఏకంగా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా నాగభీడ్‌ తాలూకా బాలాపూర్‌(ఖుర్దు)లో వెలుగులోకి వచ్చింది. బాలాపూర్‌ గ్రామ పొలిమేరలో ఓ రైతుకు చెందిన పశువుల పాక నుంచి సోమవారం ఉదయం చిరుత బయటకు రావడాన్ని గ్రామస్థులు పశువులను హతమార్చిందేమోనని అక్కడికి వెళ్లి చూశారు. తీరా అక్కడ మూడు చిరుత కూనలు కనిపించాయి. వెంటనే వారు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. మరోవైపు వారం రోజులుగా ఓ చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరోవైపు పలు పశువులపైనా దాడి చేసి చంపేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version