లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం.. అయోధ్య రామాలయంపై ఎల్‌కే అడ్వాణీ

-

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ బీజేపీ సీనియర్ నేత, ‘అయోధ్య’ రథసారథి ఎల్కే అడ్వాణీ ఇటీవలే రాసిన ఓ వ్యాసంలోని కొంత సమాచారాన్ని అడ్వాణీ కార్యాలయం విడుదల చేసింది. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ప్రారంభించిన రామజన్మభూమి ఉద్యమం లౌకికవాదానికి అసలైన నిర్వచనం తిరిగి పొందేందుకు ఓ చిహ్నంగా నిలిచిందని అడ్వాణీ అభిప్రాయపడ్డారు. ‘శ్రీరామ మందిరం : నెరవేరిన దివ్య కల’ అనే పేరుతో ఆయన ఇటీవలే రాసిన ఓ వ్యాసంలోని దీనికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని ఈ ప్రకటనలో విడుదల చేశారు.

ఈ ఉద్యమం సందర్భంగానే నికార్సైన లౌకికవాదం, కుహనా లౌకికవాదాల నడుమ తేడాలపై దేశమంతా ఓ ప్రత్యేకమైన చర్చ ప్రారంభమైందంటూ ఆయన ఇందులో పేర్కొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని కళ్లారా చూడటం వల్ల తన జన్మ ధన్యమైందని తెలిపారు. ఓ భారత పౌరుడిగా తాను గర్వపడుతున్నానంటూ అడ్వాణీ ఆనందంతో పొంగిపోయారు.

1990లో రామమందిర నిర్మాణం కోసం తాము రథయాత్ర ప్రారంభించిన సమయంలో తమకు ప్రజల నుంచి పుష్కలంగా మద్దతు లభించిందని.. కానీ, ఆ సమయంలో చాలా రాజకీయ పార్టీలు తమ వెంట నడిచేందుకు వెనుకడుగు వేశాయని అడ్వాణీ చెప్పారు. ముస్లిం ఓట్లు పోతాయని వారికి భయమని.. ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగిపోయిన వారు సెక్యులరిజం పేరుతో తమ వైఖరిని సమర్థించుకున్నారని అన్నారు. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాత్మక తీర్పుతో ప్రశాంత వాతావరణంలో ఇప్పటి రామమందిర పునర్నిర్మాణం జరుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అడ్వాణీ ఆనందం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news