బ్రిటీష్ చట్టాలకు చెక్!.. మూడు క్రిమినల్ బిల్లులకు లోక్సభ ఆమోదం

-

పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నూతన క్రిమినల్‌ బిల్లులు బుధవారం రోజున లోక్‌సభ ఆమోదం పొందాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై చర్చ, కేంద్ర సర్కార్ సమాధానం అనంతరం మూడు బిల్లులకు లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

నూతన బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. భారతీయతను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా దేశ ప్రజల హితం కోరి నూతన క్రిమినల్ బిల్లులు తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నూతన చట్టాల్లో సాంకేతికతకు ప్రోత్సాహం ఇచ్చినట్లు తెలిపారు. బ్రిటిష్ చట్టాలు వారి రాజరిక పాలనను రక్షించుకునేందుకు తెస్తే, తాము ప్రజలే కేంద్రంగా నూతన బిల్లులను తెచ్చామని స్పష్టం చేశారు

మోదీ నేతృత్వంలో తెచ్చిన 3 బిల్లులు.. న్యాయం, సమానత్వం, నిష్పాక్షకత మూల సిద్ధాంతంగా చాలా పెద్ద మార్పులు తీసుకుని వచ్చాయని అమిత్ షా అభివర్ణించారు. ఈ చట్టాల ద్వారా త్వరగా న్యాయం చేసేందుకు పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తి అందరికీ తగిన సమయం ఇచ్చే ప్రయత్నం చేసినట్లు వివరించారు. ముఖ్యంగా ఈ బిల్లులో ఉగ్రవాదానికి నిర్వచనం ఇచ్చామన, రాజద్రోహాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త సెక్షన్ను తీసుకొచ్చామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news