మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్!!

-

 

పార్లమెంట్‌ ఎన్నికలపై కీలక అప్డేట్‌ వచ్చింది. మార్చిలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ 15న రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. ఏప్రిల్ మూడో వారంలో తెలంగాణ లోక్ సభకు సంబందించిన ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

Lok Sabha Election Notification in March

ఇక పార్లమెంట్‌ ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఈ లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నారట. ఆమెను నేరుగా రాజ్యసభకు కాంగ్రెస్ నామినేట్ చేయనుందట. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారని తెలుస్తోంది. కాగా రెండు దశాబ్దాలుగా సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news