ఏడో విడతకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ

-

పార్లమెంట్ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మే 14వ తేదీ వరకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు గడువు ఉంది. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 17వ తేదీ వరకు నామినేషన్‌ ఉపసంహరించేందుకు అవకాశం ఉంది.

ఏడో విడతలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి స్థానానికి పోలింగ్‌ జరగనుంది. ఈనెల 14వ తేదీన ప్రధాని మోదీ వారణాసిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. చివరి విడతలో బిహార్‌లో 8, ఝార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4, పశ్చిమ్‌ బెంగాల్‌లో 9, ఒడిశాలో 6, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌ స్థానానికి జూన్‌ 1న ఓటింగ్ జరగనుంది. అటు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఈ విడతలోనే జరగనుంది. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించడంతో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఈ స్థానాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news