లోక్ సభ ఘటన.. అదుపులో మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు

-

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అంతా సవ్యంగా సాగుతున్న వేళ ఇటీవల లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనను కేంద్ర సర్కార్ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే స్పీకర్ విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ తన పవి తాను చేసుకుపోతోంది. మరోవైపు 50 బృందాలు నిందితుల వివరాలు సేకరించే పనిలో పడ్డాయి.

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రోజున కీలక ఘటన చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ టెకీని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి. అయితే అతడు కర్ణాటక పోలీసు శాఖలో పనిచేసిన ఓ మాజీ ఉన్నతాధికారి కుమారుడని సమాచారం. అతడు ఈ ఘటనలో ఏ రకంగా పాలు పంచుకున్నాడో తెలియాల్సి ఉంది. అతడితో పాటు తండ్రి హస్తం ఏమైనా ఈ ఘటనలో ఉందా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ ఘటనపై విచారణ పూర్తి చేసి నిజానిజాలు తేల్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news