‘మధ్యప్రదేశ్’ మళ్లీ బీజేపీదే.. ఐదోసారి కమలానికి పట్టం!

-

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌లా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌ లో మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి స్పష్టమైన మెజార్టీని బేజీపీ ప్రదర్శించింది. రాష్ట్రంలో 230 స్థానాలకు.. ప్రభుత్వ ఏర్పాటుకు 116 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా.. బీజేపీ ఇప్పటికే 141 స్థానాల్లో  జయకేతనం ఎగురవేసింది. మరో 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 165+ స్థానాల అఖండ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరోవైపు సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మధ్యప్రదేశ్‌లో 2018 మినహా రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారు. 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 173 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. 2008లో 143, 2013లో 165 స్థానాల్లో గెలుపొందింది. 2018లో కాంగ్రెస్ 119, బీజేపీ 109 స్థానాలు గెలుచుకున్నాయి. రాష్ట్రంలో కమల్‌నాథ్‌ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. 2020లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోయింది. ఆయన బీజేపీకి మద్దతు తెలపడంతో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news