తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా సాగించింది. 64 స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. మరోవైపు బీఆర్ఎస్ 65 స్థానాల్లో గెలుపు సాధించింది. మరోవైపు బీజేపీ ఇప్పటి వరకు 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తమ పార్టీకి మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికా పోస్టు చేశారు.
“బీజేపీని సపోర్ట్ చేసిన తెలంగాణ సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు. గత కొన్నేళ్లుగా మీ సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్తున్నాం. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగాలి. తెలంగాణతో మా అనుబంధం ఎవరూ తెంచలేరు. రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడతాం. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నా అభినందనలు. అలాగే ఈ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరిన అభ్యర్థులకు కంగ్రాట్స్. ’’ – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
నా ప్రియమైన తెలంగాణా సోదరసోదరీమణులారా,
మీరు @BJP4India కి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, మా మద్దతు పెరుగుతూనే ఉంది, ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది.
తెలంగాణతో మా బంధం విడదీయరానిది, ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం.
ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన…
— Narendra Modi (@narendramodi) December 3, 2023