బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఘాటు కామెంట్స్

-

క్రిమినల్‌ కేసులు నమోదైన వారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్‌తో పడగొట్టించడంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధి విధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం సరి కాదని హితవు పలికింది. బుల్డోజర్‌తో ఇళ్లను కూల్చడాన్ని తప్పుబడుతూ ఇలా చేయడం పురపాలక అధికారులకు ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించింది. ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్‌ లంగ్రి అనే వ్యక్తి ఆస్తి వివాదంలో ఒక వ్యక్తిని బెదిరించి అతడిపై దాడి చేశాడు. ఆ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ కేసులో రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం పోలీసులు, పురపాలక అధికారులు కలిసి రాహుల్‌కు చెందిన రెండంతస్తుల భవనాన్ని కూలగొట్టడంతో రాహుల్‌ భార్య రాధ కోర్టును ఆశ్రయించారు. ఈ భవనంపై చర్య తీసుకొనే సమయంలో దాని మాజీ యజమాని రైసాబీ పేరిట అధికారులు నోటీసులు జారీ చేసినట్లు ఆరోపించిన ఆమె తమ నివాసం అక్రమ నిర్మాణం కాదని వాదించారు. ఆ ఇల్లు హౌసింగ్‌ బోర్డులో నమోదైందని.. బ్యాంకు రుణం కూడా పొందామని ఆధారాలు చూపించారు. ఈ కేసుపై విచారణ అనంతరం జస్టిస్‌ వివేక్‌ రుసియా తీర్పు వెలువరించారు.

Read more RELATED
Recommended to you

Latest news