బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలో మూడు నెలల్లో 767 మంది రైతుల ఆత్మహత్య జరిగాయి. ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి నెల వరకు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో 767 రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించారు బీజేపీ మంత్రి మకరంద్ జాదవ్ పాటిల్.

ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో కేవలం 373 మంది రైతులు మాత్రమే ప్రభుత్వం అందించే నష్ట పరిహారానికి అర్హులని తెలిపారు బీజేపీ మంత్రి మకరంద్ జాదవ్ పాటిల్. రైతుల మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రతీ జిల్లాలో కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బీజేపీ మంత్రి మకరంద్ జాదవ్ పాటిల్.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.