బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలను ప్రయత్నించాల్సిందే..!

-

చాలా శాతం మంది సరైన జీవన శైలి లేకపోవడం వాళ్ళ ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా తక్కువ సమయంలోనే వేగంగా బరువును పెరుగుతూ ఉంటారు. అందువలన వ్యాయామాలు, డైట్ లు వంటివి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే సరైన ప్రయోజనం ఉండకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో బరువును త్వరగా తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను తప్పకుండా పాటించాలి అని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో ఎంతో క్రమశిక్షణ అవసరం. ముఖ్యంగా తీసుకునే ఆహారం పై ఎంతో జాగ్రత్త వహించాలి.

బరువు తగ్గాలనుకునే వారు అల్పాహారంలో భాగంగా ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయడం వలన రోజంతా కడుపు నిండిన అనుభూతిని పొందుతారు మరియు ఎటువంటి ఆకలి కూడా ఉండదు. చాలా శాతం మంది బరువు తగ్గాలనుకునే వారు క్యాలరీలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు. దానికి బదులుగా పోషకాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. కొంతమంది డైట్ చేసేవారు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. దానికి బదులుగా రెండు మీల్స్ ను ఎక్కువగా తీసుకొని రాత్రిపూట ఉపవాసాన్ని ప్రయత్నించండి. ఇలా చేయడం వలన అనవసరంగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోరు.

బరువు తగ్గాలనుకుంటే ఎనర్జీ డ్రింక్‌లకు దూరంగా ఉండడం మేలు. ఎనర్జీ డ్రింక్స్, కాఫీ వంటివి తాగడానికి బదులుగా మంచినీరు, పండ్ల రసాలు వంటివి తీసుకోవాలి. అయితే వాటిలో చక్కెర మరియు పాలు అస్సలు ఉపయోగించకూడదు. స్నాక్స్ లో భాగంగా ప్రాసెస్డ్ లేక డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలకు బదులుగా ప్రోటీన్ ఉండేటువంటి నట్స్ ను ఎంపిక చేసుకోండి. ఈ విధంగా మీ డైట్‌ ను తయారు చేసుకుని అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే కచ్చితంగా బరువు నియంత్రణలో ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news