అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ.. 32 ఏళ్ల దీక్ష విరమించిన 60 ఏళ్ల వృద్ధుడు

-

శ్రీరామజన్మభూమి అయోధ్యలో చారిత్రక ఘట్ట ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభించి సరిగ్గా 12.29 గంటలకు బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం సాగింది. మొదటగా దిల్లీ నుంచి అయోధ్య చేరుకున్న మోదీ సంప్రదాయ దుస్తులతో శ్రీరాముడి భవ్యమందిరానికి చేరుకుని రాముడికి ప్రత్యేక వస్త్రాలను తీసుకుని వచ్చి పండితులకు సమర్పించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా మోదీ వ్యవహరించారు.

కోట్ల మంది కల నెరవేరిన ఈ మధురక్షణాల్లో మహారాష్ట్రలోని జల్‌గావ్‌కు చెందిన 60ఏళ్ల వృద్ధుడు తన 32 ఏళ్ల దీక్షను విరమించారు. అయోధ్యలో రామమందిరం నిర్మించేవరకు చెప్పులు ధరించనని విలాస్‌ భావ్‌సర్‌ అనే వ్యక్తి 1992లో ప్రతిజ్ఞ చేశారు. ఆనాటి నుంచి చెప్పులు వేసుకోకుండానే నడుస్తున్నారు. తాజాగా అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ పూర్తి కావడంతో ఆయన దీక్షను విరమించారు. జల్‌గావ్‌లో జరిగిన దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌.. విలాస్‌ భావ్‌సర్‌కి చెప్పుల జతను అందించగా ఆయన చెప్పులు వేసుకుని నడిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version