దేశంలో ఆత్మహత్యల పై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. 18 వేలకు పైగా ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. 13 వేలకు పైగా ఆత్మహత్యలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత 12 వేలకు పైగా ఆత్మహత్యలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో నిలిచింది. 2019లో తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 7675గ ఉంది.
ఆత్మహత్య చేసుకున్న వారిలో 2858 మంది కూలీలే అని లెక్కలు చెప్తున్నాయి. 2019లో 499 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2019 లో ఏపీలో 6465 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా సమయంలో ఆత్మహత్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆర్ధిక ఇబ్బందులతో గత మార్చ్ నుంచి కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.