రామేశ్వరం కెఫే పేలుడు కేసులో ప్రధాన నిందితుల అరెస్టు

-

కర్ణాటక బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా కీలక అడుగు ముందుకు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను ఎన్ఐఏ తాజాగా అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్‌ షాజిబ్‌, సూత్రధారి అబ్దుల్ మతీన్‌ తాహాను అరెస్టు చేసింది. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవారు అస్సాం, పశ్చిమ్‌ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. విశ్వనీయవర్గాల సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన అధికారులు వారిని పట్టుకున్నారు.

మార్చి 1వ తేదీన రామేశ్వరం కెఫేలో మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. తొలుత గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు భావించగా.. ఘటనాస్థలిలో ఓ హ్యాండ్‌ బ్యాగ్‌ పేలినట్లు కనిపించడం వల్ల పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 307, 471, ఉపాలోని 16, 18, 38, పేలుడు పదార్థల చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఘటనపై విచారణ జరుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news