ప్రియాంక గాంధీ కోసం మమతా బెనర్జీ రంగంలోకి..!

-

సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వయనాడ్ లో ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవల ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం, ముఖ్యంగా కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటున్నట్లు కనిపించడంతో మమతా బెనర్జీ మోడీని ఎదుర్కొడానికి కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని చూస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి.

రాహుల్ గాంధీ రాయ్ బలేరి, వయనాడ్ లోక్సభ నియోజకవర్గాలలో భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆయన వాటిలో ఏదో ఒక్క స్థానానికి పరిమితం కావాల్సి రావడంతో గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వయనాడ్ లోక్ సభ స్థానంలో ప్రియాంక గాంధీని రంగంలోకి దించుతున్నారు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారం చేస్తారని ప్రచారాలు రావడంతో ప్రియాంక, వయనాడ్ లో భారీ మెజార్టీతో గెలుస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news