హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవింగ్.. వీడియో వైరల్

-

సాధారణంగా చాలా మంది వాహనం నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా బైకులపై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే చాలా మంది ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకుండానే వాహనం నడుపుతుంటారు. అయితే యూపీలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా కారు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజాపూర్‌లో లోకేంద్ర సింగ్ అనే డాక్టర్ కారు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ పెట్టుకుని కారు నడుపుతున్న సమయంలో అటుగా వెళ్లే వాహనదారులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇలా ఎందుకు చేశారని ఆరా తీస్తే ఆ డాక్టర్ చెప్పిన సమాధానం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. కారు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదన్న కారణంతో తనకు రూ.1000 జరిమానా విధించారని.. దీనిపై ఫిర్యాదు చేస్తే ట్రాఫిక్ అధికారులు దురుసుగా ప్రవర్తించారని లోకేంద్ర సింగ్ తెలిపారు. అందుకే హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే చలాన్ పొరపాటు జారీ చేశామని, దాన్ని రద్దు చేసినట్లు ఆ తర్వాత పోలీసులు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news