నేడు మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నిక‌లు..బరిలో 173 మంది అభ్యర్థులు

-

మణిపూర్ రాష్ట్రంలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని మొదట కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మణిపూర్ రాష్ట్రం లోని ఇంపాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, చుర చందు పూర్, కాంగ్ పొక్పి, అనే ఐదు జిల్లాల్లో ఇవాళ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఓటింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల సమయం వరకు కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో… పాజిటివ్ గా ఉన్న వారు, గోరంట్ల లో ఉన్నవారికి చివరి గంట లో ఓటు వేయడానికి అనుమతిస్తారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్ ప్రకారం ఐదు జిల్లాల పరిధిలో ఉన్న 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకంగా 173 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 15 మంది మహిళలు ఉండగా మిగతా వారంతా పురుషులు. కాగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news