హైదరాబాద్ మహా నగరంలో నిబంధనలకు విరుద్దంగా, రిజిస్ట్రేషన్ లేకుండా.. ఇష్టాను సారంగా తీరుగుతున్న ఆటోలపై కొరడా ఝుళిపించడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి హైదరాబాద్ మహా నగర పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. నిబంధనలుకు విరుద్దంగా, రిజిస్ట్రేషన్ లేని ఆటోలను సీజ్ చేయనున్నారు. కాగ హైదరాబాద్ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. 1.5 లక్షల ఆటోల రిజిస్ట్రేషన్ మాత్రమే ఉన్నాయి. కానీ నగరంలో దాదాపు 3 లక్షలకు పైగా ఆటోలు తిరుగుతున్నాయి.
దీంతో నేటి నుంచి జరగే స్పెషల్ డ్రైవ్ లో ఆటోల దృవపత్రాలు లేకుండా ఉంటే.. వేంటను సీజ్ చేయనున్నారు. అలాగే హైదరాబాద్ నగర పరిధిలో ఆటోలు తిరగాలంటే.. తప్పకుండా హైదరాబాద్ లోనే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలకు నగరంలోకి అనుమతి ఉండదు. అంటే టీఎస్ లేదా ఏపీ 09 – 13 నంబర్ తో రిజిస్ట్రేషన్ ఉన్న ఆటోలు మాత్రేమ.. నగరంలో అనుమతి ఉంటుంది. అలాగే ఈ స్పెషల్ డ్రైవ్ లో డ్రైవర్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్యూరెన్స్ తో పాటు యూనిఫాం ను కూడా తనిఖీ చేయనున్నారు.