BREAKING : సుప్రీం కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

-

ఢిల్లీ లిక్కర్‌ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ లిక్కర్‌ కేసులో… సుప్రీం కోర్టును ఆశ్రయించారు మనీష్ సిసోడియా. సీబీఐ అక్రమంగా సిసోడియాను అరెస్ట్ చేసిందని.. సీబీఐ అరెస్ట్ ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో సిసోడియా తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. అయితే, ఈ కేసును మార్చి మొదటి వారంలో సుప్రీం కోర్టు విచారణ… చేపట్టనుంది.

ఇక అటు మనీశ్‌ సిసోడియా ను ఢిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మనీశ్​ సిసోడియాకు 5 రోజుల సీబీఐ రిమాండ్​ను విధించింది ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ జిల్లా న్యాయస్థానం. ఆదివారం సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ.. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం న్యాయస్థానంలో సిసోడియాను హాజరుపరిచింది. సానుకూలంగా స్పందించిన కోర్టు మార్చి 4 వరకు రిమాండ్​కు అనుమతినిచ్చింది. అంతకుముందు కోర్టులో వాదనలు వినిపించిన మనీశ్​ తరఫు న్యాయవాది.. ఈ కేసులో మంత్రి పాత్ర ఏమి లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news