ఏపీ రైతులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్. వరుసగా నాల్గో ఏడాది రైతు భరోసా నిధులు విడుదల చేసిన జగన్.. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా వేశారు. వ్యవసాయం మీద ప్రేమంటే ఇది.. రైతులకు ఏటా రూ.13,500 చెల్లిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు సీఎం జగన్. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54 వేలు అందించామని వివరించారు సీఎం వైఎస్ జగన్.
27,800 కోట్ల తో రైతు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం..రైతుల కోసం మొత్తం లక్షా నలభై ఐదువేల కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. మనం చేస్తున్న పనులకు అసూయ పడుతున్న వారికి చెప్తున్న , అసూయ కు అసలు మందు లేదు..చంద్రబాబు ది పెత్తం దార్ల పార్టీ అని ఫైర్ అయ్యారు జగన్. రైతులను వంచించిన చంద్రబాబు కు రైతు ల కోసం పని చేస్తున్న మీ బిడ్డ కి మధ్య యుద్దం జరుగుతుంది…కరువు తో ఫ్రెండ్ షిప్ చేసే చంద్రబాబు కు, వరునిడి ఆశీస్సులు ఉన్న మీ బిడ్డ జగన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతుందని మండిపడ్డారు జగన్.