మోదీ మళ్లీ సీఎం కావాలి.. ప్రచార సభలో నోరుజారిన నీతీశ్‌

-

రాజకీయ నేతలు పలు వేదికలపై మాట్లాడుతూ అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. కొన్నిసార్లు అవి వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. కొన్నిసార్లు ప్రచారంలో నేతలు తమ పార్టీకి ఓటు వేయమనబోయి.. తొందరలో తమ ప్రతిపక్షానికి ఓటేయమని చెబుతుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నికల ప్రచారంలో చాలా చోటుచేసుకుంటాయి. వీటి వీడియోలు నెట్టింట హల్చల్ చేసి సదరు నేతపై తీవ్ర ట్రోలింగ్ కూడా జరిగిన ఘటనలున్నాయి. తాజాగా బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు.

తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో నీతీశ్ తడబడ్డారు. నరేంద్రమోదీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అధికార ఎన్డీయే తరఫున ఆదివారం పట్నాలో ప్రచారం చేసిన ఆయన.. ‘‘మేం (ఎన్డీయే) దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో గెలవాలని, నరేంద్రమోదీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అప్పుడే భారత్‌ అభివృద్ధి చెందుతుంది. బిహార్‌ అభివృద్ధి చెందుతుంది. ప్రతిదీ జరుగుతుంది’’ అని నీతీశ్‌ పేర్కొన్నారు. అక్కడే ఉన్న నేతలు అప్రమత్తం చేయడంతో ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని సరిచేసుకుని మోదీ మరోమారు ప్రధాని కావాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news