FLASH: తెలంగాణ,ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘రెమాల్’ తుఫాను తీరం దాటినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య నిన్న (మే 26) రాత్రి 10.30 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల మధ్య తీవ్ర తుఫానుగా మారి తీరం దాటింది.
అనంతరం ఇది ఈశాన్య దిశలో కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇక ‘రెమాల్’ తుఫాన్ ఉన్న తరుణం లోనే తెలంగాణ,ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి.