మిలియనీర్ స్వీపర్‌.. ఈ కార్మికుడి ఇంట్లో 9 లగ్జరీ కార్లు!

-

అతడో పారిశుద్ధ్య కార్మికుడు. కానీ కోట్లకు పరిగెత్తాడు. ఏకంగా 9 లగ్జరీ కార్లకు మాలిక్. స్వీపర్ గా నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి పొంది.. ఆ తర్వాత ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేసి కోట్లు ఆర్జించాడు. అయితే ఫైళ్ల తారుమారుతో అధికారులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది అంటే..?

ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా జిల్లాకు చెందిన సంతోశ్ జైస్వాల్ అనే వ్యక్తి మొదట పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్​గా పదోన్నతి పొంది ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేసి రూ. కోట్లలో ఆస్తులను సంపాదించాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో  దేవీపటాన్ డివిజన్ కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా విచారణకు ఆదేశించి సంతోశ్ జైస్వాల్ ఫైళ్లను తారుమారు చేశాడని తెలియడం వల్ల అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సంతోశ్ ఆస్తులను పరిశీలించిన అధికారులు షాక్ అయ్యారు. అతడి వద్ద 9 లగ్జరీ వాహనాలు ఉన్నట్లు గుర్తించారు.  ఈ కార్లు పరిశీలించిన అధికారులు అతడి బ్యాంక్ బ్యాలెన్స్ ను చెక్ చేసే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news