కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి వందల మంది బలయ్యారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 300 మందికిపైగా మరణించారు. వందల మంది ఆచూకీ గల్లంతయింది. వారం రోజులుగా వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వయనాడ్ విధ్వంసానికి దారి తీసిన కారణాలపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అక్రమ కట్టడాలు, మైనింగ్‌వల్లే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం జరిగిందని భూపేంద్రయాదవ్ అన్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ కనుమల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించే ప్రక్రియపై రాష్ట్రాలతో చర్చిస్తున్నామని తెలిపారు. పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించేందుకు 2014 నుంచి జులై 31 వరకూ ఆరు ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశామని .. కానీ రాష్ట్రాల అభ్యంతరాలతో తుది నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడించారు. దీనిపై చర్చలు జరుగుతుండగానే.. కేరళలో అక్రమ నిర్మాణాలకు, మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారని .. దీని వల్లే వయనాడ్ విపత్తు జరిగిందని ఆరోపించారు.