ఢిల్లీలో నీటి కొరతపై యూపీ, హర్యానా సీఎంలకు లేఖ రాసిన మంత్రి అతిషి

-

దేశ రాజధానిలో నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించడానికి అదనపు నీటిని విడుదల చేయాలని అభ్యర్థిస్తూ ఉత్తరప్రదేశ్, హర్యానా ముఖ్యమంత్రులకు జూన్ 2న ఢిల్లీ నీటి మంత్రి అతిషి లేఖ రాశారు. ఆమె తన లేఖలో సీఎం యోగి ఆదిత్యనాథ్, నయాబ్ సింగ్ సైనీలను ఉద్దేశిస్తూ, నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న కారణంగా ప్రజలకు సరిపడా నీళ్లు అందించడానికి ఢిల్లీకి ఒక నెలపాటు అదనపు నీటిని విడుదల చేయాలని కోరింది. వచ్చే నెలలో వర్షాకాలం రానుంది, అప్పటి వరకు నివాసితులకు స్వచ్ఛమైన తాగునీటి లభ్యత ఉండేలా చూడాలని అభ్యర్ధించింది.

ప్రభుత్వం తన నీటి శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి గరిష్టంగా కృషి చేస్తోంది. అయినప్పటికీ, వేడి గాలుల ప్రభావం కారణంగా నీరు అడుగంటిపోయాయి. ఈ సమస్యను తీర్చడానికి మాకు అన్ని వర్గాల నుండి సహాయం కావాలని అతిషి రాశారు. అయితే నగర ప్రజలు నీటి గురించి ఆందోళన చెందవద్దని యూపీ, హర్యానా సీఎంలు చెప్పినట్లు సమాచారం. ఈ సీజన్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో గరిష్టంగా నమోదవుతున్నాయి. యమునా నదిలో నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో ఢిల్లీ నగర వాసులు ఎన్నడూ చూడని నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నీటి వృథాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అనపరంగా నీళ్లను వృధా చేసినట్లయితే రూ.2000 జరిమానా కూడా విధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news