BREAKING : క్షీణించిన దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం

-

దిల్లీకి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆప్ మంత్రి ఆతిశీ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇవాళ తెల్లవారుజామున ఆతిశీని ఆప్ నేతలు లోక్నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు. షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్లే ఆతిశీ ఆరోగ్యం క్షీణించిందని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. సోమవారం రాత్రే ఆతిశీ షుగర్ లెవల్స్ తగ్గిపోయాయని.. రక్త నమూనాలను ఆస్పత్రికి పంపించినప్పుడు 36కి పడిపోయాయి అని వైద్యులు చెప్పారని భరద్వాజ్ తెలిపారు. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. ప్రస్తుతం ఆతిశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

దిల్లీ ప్రజలకు నీరు అందించడం కోసం గత 5 రోజులుగా మంత్రి అతీశీ నిరాహార దీక్ష చేస్తున్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఏమీ తినకపోవడం వల్ల మరింత ఆరోగ్యం క్షీణించిందని వెల్లడించారు. ఆతిశీ రక్తనమూనాలకు ఆస్పత్రికి పంపించగా రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు నిర్ధరించారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news