దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. బీజేపీ రాజకీయ ఆయుధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరిస్తోందని విమర్శించారు. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ గురువారం కోర్టులో వినిపించిన వాదనల గురించి అతిశీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసు దర్యాప్తు కోసం ఈడీ పాస్‌వర్డ్‌లు అడగటం లేదని, కేజ్రీవాల్ ఫోన్‌లో ఏముందో తెలుసుకునేందుకు ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని మంత్రి మండిపడ్డారు. ఆప్ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలతో జరిపిన చర్చలు, మీడియా-సోషల్ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ అన్నారు.