నేడు మిజోరం శాసనసభ ఎన్నికల ఫలితాలు

-

సార్వత్రిక సెమీఫైన్​లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగ్గా మొదటి నాలుగు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడ్డాయి. ఇందులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోగా.. మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఇక మిజోరాంలో మాత్రం డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడాల్సి ఉండగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఇవాళ ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరగనుంది. మొత్తం 13 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యలెట్ ఓట్లను లెక్కించనున్నారు.  ఆపై ఈవీఎంలలోని ఓట్లను కౌంట్ చేయనున్నారు. మొత్తం నాలుగు వేల మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొననున్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మిజోరాం అదనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్‌.లియాంజెలా ఆదివారం వెల్లడించారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మిజోరంలో  జొరాం పీపుల్స్‌ మూమెంట్‌ -జేపీఎం, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ -ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోరు జరిగింది. మిజోరాం ప్రజలకు ఆదివారం ప్రత్యేకమైన రోజు కావడంతో కౌంటింగ్ తేదీ మార్చాలని వివిధ వర్గాలు అభ్యర్థించగా ఈసీ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news