ఆ రాష్ట్రంలో మొబైల్- ఇంటర్నెట్ సేవలు బంద్

-

పంజాబ్ రాష్ట్రంలో మొబైల్- ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.ఆ రాష్ట్రంలోని పాటియాలా లో ఉన్న కాళీ మందిర్ ప్రాంతంలో శివసేన నేతలు, ఖలిస్తాన్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.పైగా ఖలిస్తాన్ మద్దతుదారులు, శివసేన కార్యకర్తలు పోటా పోటీగా ర్యాలీలు నిర్వహించాయి.దీంతో ఘర్షణ చోటు చేసుకుంది.ఇరు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.కత్తులతో వీరంగం సృష్టించారు.దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పటియాల కు అదనపు బలగాలను రప్పించారు.మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు చల్లారక పోవడం, వదంతులు వ్యాపిస్తుండడంతో సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

శాంతిభద్రతల విషయంలో వైఫల్యం చెందారని, హింసను నియంత్రించడంలో విఫలమయ్యారని ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై భగవంత్ మాన్ సర్కార్ చర్యలు తీసుకుంది.పటియాల రేంజ్ ఐజితో పాటు ఎన్ఎస్పి, ఎన్ పి లను ఆ పదవి నుండి బదిలీ చేశారు.అదే సమయంలో పోలీసులు పాటియాలా లో శుక్రవారం రాత్రి 7 గంటల నుండి ఈరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.పరిస్థితులు ఇప్పటికీ అలాగే ఉండడంతో ఆదివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news