దేశం గర్వపడేలా చేయడమే లక్ష్యం అన్నారు టీమిండియా బౌలర్ సిరాజ్. ఆసియాకప్ లో తన ప్రదర్శనపై భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ స్పందించారు. ‘బ్లూ జెర్సీ ధరించడం కంటే పెద్ద గౌరవం ఏదీ లేదు. ఇవాల్టి ప్రదర్శన మరింత కష్టపడి ఆడేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి. గంటల కొద్ది సాధన, కృషికి తగ్గ ఫలితాలు చూడటం సంతోషంగా ఉంది.
నేను సాధించాల్సింది చాలా ఉంది. నా ప్రదర్శనతో మన దేశం గర్వపడేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అని ట్విట్ చేశారు. కాగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టును 50 పరుగులకే పరిమితం చేయడంతో మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టి కీలకపాత్ర పోషించాడు. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 6.1 ఓవర్లలోనే సాధించింది. ఆ తర్వాత విజేతగా టీమిండియా 150,000 US డాలర్లను (రూ. 1 కోటి 25 లక్షలు) ప్రైస్ మనీగా అందుకుంది.