ఇండియాలో మళ్ళీ మంకీ ఫీవర్ కలకలం..తొలి కేసు నమోదు

-

ప్రస్తుతం ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఇండియా వ్యాప్తంగా విపరీతంగా కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి కరోనా కేసులు. ఇలాంటి తరుణంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇండియాలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది.

కేరళలోని వయా నాడు లో 24 సంవత్సరాల యువకుడికి మంకీ ఫీవర్ సోకింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉండటంతో మనంతవాడి మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నట్లు కేరళ వైద్యులు తెలిపారు. మంకీ ఫీవర్ సోకిన 24 ఏళ్ల యువకుడికి అత్యున్నత వైద్య సౌకర్యం అందిస్తున్నామని కూడా స్పష్టం చేశారు. ఈ ఫీవర్ ను మళ్ళీ వ్యాప్తి చెందకుండా తాము చూసుకుంటామని పేర్కొన్నారు వైద్యులు.

ఇక ఈ ఏడాది కేరళలో మంచి ఫీవర్ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్లావి విరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అధిక జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి డెంగ్యూ లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. అలాగే ఐదు శాతం నుంచి 10 శాతం వరకు మరణాలు కూడా సంభవిస్తాయి అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news